సీరియస్ ఇష్యూ- కేటీఆర్ వద్దకు చేరిన వరంగల్ లీడర్స్ పంచాయితీ

వరంగల్ జిల్లాలోని టీఆరెఎస్ ఇంటిపోరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ వద్దకు చేరినట్లు కనిపిస్తోంది. కొంతకాలంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మధ్య నెలకొన్నపంచాయతీ తారా స్థాయికి చేరింది. ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఎమ్మెల్యే పెద్దికి తీవ్ర అవమానం జరిగింది. పోలీసులు తన పట్ల ప్రవర్తించిన తీరుకు ఆయన అసంతృప్తితో వెనుదిరిగారు. ఎమ్మెల్యే కు జరిగిన అవమానం వెనుక మంత్రి ఎర్రబెల్లి ఉన్నారని ఆయన వర్గీయులు ఆరోపించారు. తాజాగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. వరంగల్ జిల్లా రాజకీయాలు, ఎర్రబెల్లి దయాకరరావు తీరు పై కేటీఆర్ దగ్గర ఎమ్మెల్యే పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీనే నమ్ముకొని పని చేస్తున్న తనకు…మరో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కారణంగా అవమానం జరగడం బాగోలేదని కేటీఆర్ వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *