హైదరాబాద్‌లో బోనాల సందడి షురూ

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర సందడి నగరంలో షురూ అయ్యింది. బోనాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. బోనాల జాతర కోసం నగరంలోని అమ్మవారి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.  జులై 11న గోల్కొండ బోనాలు, జులై 25న లష్కర్ బోనాలు, జులై 26న లష్కర్‌లో బోనాలకు రంగం, ఆగస్టు 1న ఓల్డ్ సిటీ బోనాలు, ఆగస్టు 2న ఓల్డ్ సిటీలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఉమ్మడి దేవతల ఊరేగింపు జరుగనుంది. ఈసారి ఆషాడ బోనాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.