మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేటు..?

మాజీ మంత్రి ఈట‌ల‌ రాజేందర్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ట‌చ్ లో ఉన్నారా…?ఈటలపై నిఘా పెట్టిన కేసీఆర్ కు ఈటలతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే చిక్కాడా…? ఇప్పుడు ఈ ప్రశ్నలకు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.మాజీ మంత్రి ఈట‌ల‌కు టీఆర్ఎస్ నేత‌ల‌తో ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందరితోనూ ఆయనకు సత్సంబందాలు ఉన్నాయి. ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో చాలామంది ఆయనతో దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆయనతో వ్యక్తిగత సంబంధాలు కూడా మెయింటేన్ చేయడం లేదు. అయితే, ఈట‌ల‌తో స‌న్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక‌రైన పెద్దప‌ల్లి ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డిపై ఇప్పుడు కేసీఆర్ దృష్టి ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవల సిఎం పర్యటనలో పెద్దప‌ల్లి ఎమ్మెల్యే కనిపించగా…ఆయనను కేసీఆర్ సెటైరికల్ గా పలకరించడం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది. దీంతో ఎదో జరుగుతుందని అంతా అనుకున్నారు. నిజానికి ఈట‌ల‌కు, ఎమ్మెల్యేకు మంచి సంబంధాలుండేవి. ఉద్యమం నుండి వీరిద్దరికి సాన్నిహిత్యం ఉంది. తాజాగా ఎమ్మెల్యే మ‌నోహ‌ర్ రెడ్డికి చెందిన ట్రినిటి విద్యాసంస్థల‌పై టీఆర్ఎస్ అనుకూల ప‌త్రికగా ముద్రప‌డ్డ పేప‌ర్ లో అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వేటు పడే ముందు ఇలాంటివి జరగడం టీఆర్ఎస్ లో చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మ‌నోహ‌ర్ రెడ్డిపై చ‌ర్యల్లో భాగంగానే ఈ క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని జిల్లాలో ప్రచారం జ‌రుగుతోంది. ఈట‌ల స‌హ ఆయ‌నతో గ‌తంలో మెరుగైన సంబంధాలున్న అన్ని పార్టీల నేత‌ల‌పై కేసీఆర్ నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే చిక్కినట్లు తెలుస్తోంది. చూడాలి మరి..ఎం జరుగుతుందో..

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.