భట్టి ఢిల్లీ టూర్-అధిష్టానం ఆగ్రహంగా ఉందా..?

కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. దీంతో ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత భట్టికి అధిష్టానం నుంచి రావడం చర్చంశనీయమైంది.

భట్టి ఎందుకు ఢిల్లీ వేల్లాడనే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ లో చ‌ర్చనీయాంశంగా మారాయి. సీఎల్పీ నేత‌గా ఉండి సీఎంతో స‌మావేశం కావ‌టంతో అనేక విమ‌ర్శలొచ్చాయి. 7 సంవ‌త్సరాలుగా అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్… ఓ లాక‌ప్ డెత్ ఇష్యూలో ఇచ్చాడంటే న‌మ్మొచ్చా, ప్రగ‌తి భ‌వ‌న్ కోట‌లో జ‌రిగిన ర‌హ‌స్య మీటింగ్ సారాంశం ఏంటీ అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించాయి. ఆ త‌ర్వాత కేసీఆర్ ద‌ళిత్ మీటింగ్ పెట్టడం, ఈలోగా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించ‌టం జ‌రిగిపోయాయి.అయితే, నాటి నుండి సైలెంట్ గా ఉన్న భ‌ట్టి ఢిల్లీ వెళ్లటం ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యింది. సీఎంతో భ‌ట్టి భేటీ అయిన రోజే అధిష్టాన పెద్దలు ఆగ్రహించిన‌ట్లు ప్రచారం జ‌రిగింది. పీసీసీ ప్రకట‌న వ‌చ్చాక భ‌ట్టి మౌనంగానే ఉన్నాడు. కోమ‌టిరెడ్డి వంటి వారు త‌మ అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టినా… భ‌ట్టి మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఈ ద‌శ‌లో భ‌ట్టి కేంద్ర నాయ‌క‌త్వంతో స‌మావేశం కాబోతున్నాడు. అయితే, భ‌ట్టిని అధిష్టాన‌మే బుజ్జగించేందుకు పిలిచిందా… లేదా త‌ను ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చిందో చెప్పేందుకే భ‌ట్టి వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.