రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అందివ్వడంతో.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఓ వైపు పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తూనే..మరో వైపు కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహా రచన చేస్తోంది రేవంత్ టీం. త్వరలో సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నట్టు ఆయన శిబిరంలోని నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కల్గించేలా ఆయన పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరో పది రోజుల్లో స్పష్టమైన ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరలో పాదయాత్ర చేపట్టి.. ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. రూట్ మ్యాప్ కూడా వెలువడే అవకాశం ఉంది. దీని వెనక మరోకారణం కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేపడతారన్న వార్తల నేపథ్యంలో ముందుగానే రంగంలోకి దిగుతున్నారు రేవంత్. తెలంగాణలోని 33 జిల్లాలను మొత్తం చుట్టేలా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో.. సుదీర్ఘ పాదయాత్ర చేయాలన్నది రేవంత్ సంకల్పం. రేవంత్ తన పాదయాత్రను అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చేయనున్నట్టు సమాచారం. తన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More In తెలంగాణ
Click To Comment