ట్విస్ట్ -పాపం డాక్టర్ బాబు…అపార్ధం చేసుకుంటోన్న దీప

బుల్లితెర అభిమానులను టీవీలకు అత్తుకుపోయేలా చేస్తోంది ‘కార్తీకదీపం’ ఈవాళ ఈ సీరియల్ 1079 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. రోజులాగే ఈవాల్టి ఎపిసోడ్ కూడా ఆదరగోట్టేసింది. దీప వంట చేస్తుంటే..భాగ్యం పరుగున వచ్చి దీప ముందు ఏడుస్తూ వాలిపోతుంది. దీంతో దీప ఎం జరిగింది పిన్ని అంటూ ఆరా తీస్తుంది. ‘అమ్మో మొనిత ఎంతకు తెగించిందో తెలుసా..?అంటూ విలపిస్తుంటుంది. కంగారుగా దీప ఏం జరిగింది పిన్ని..అంటూ మరోసారి అడుగుతుంది. మొనిత భాగ్యానికి చెప్పిన పెళ్లి మ్యాటర్ ను దీప చెవిలో పడేస్తుంది. నాకు కార్తీక్ కి ఈనెల 25న రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అంటూ మోనిత భాగ్యానికి చెప్పిన పెళ్లి విషయాన్ని దీపకు ఏడుస్తూ చెప్తుంది భాగ్యం.

Karthika Deepam to feature a major twist; Monitha to ruin Karthik and  Deepa's party - Times of India

దీంతో దీప మనస్సులో మళ్ళీ అలజడి. ఇక కట్ చేస్తే…కార్తీక్ ఓ రోడ్డు మీద కారు పక్కకు నిలిపి…దీప గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నేనేమి చేయాలి..ఎం చేసి ఈ పెళ్లిని ఆపాలని పరిపరివిధలా ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్లి ఆపడం అనేది దీపకు తెలియకుండానే ఆపాలి. ఇంకా ఎంత కాలం ఈ నరకయాతన అనుభవించాలి అనుకుంటూ లోలోపల కార్తీక్ కుమిలిపోతాడు. మరోవైపు, పెళ్లి విషయం విన్న దీప ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పెళ్లి విషయం నాకు ఎవరో చిబితే కాని తెలియదు….ఎలాగూ మోనిత చెప్పదు ఎందుకంటే పెళ్లి అపుతానని…మరి డాక్టర్ బాబు అయినా చెప్పాలి కదా..ఎందుకు చెప్పలేదు..?ఈ పెళ్లి ఆపొద్దని చెప్పలేదా..? ఒకవేళ ఈ పెళ్లి జరిగితే…నేను, నా పిల్లలు ఎం కావాలంటూ బాధపడుతుంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు…..కార్తీక్ ఒకటి అనుకుంటే…జరుగుతున్నది మరొకటి…ఈ పెళ్లి మ్యాటర్ దీప చెవిలో పడటంతో ఆమె మనస్సులో కార్తీక్ ను మరోవిధంగా అనుకుంటుంది. ఇంతకీ దీప కార్తీక్ ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది..?దీప కాపురాన్ని కూల్చాలని చూస్తోన్న మోనిత డాక్టర్ బాబును వదిలిపెట్టేది ఎప్పుడు…?తెలియాలంటే ఇంకాస్తా ఓపిక పట్టాల్సిందే…

Karthika Deepam: Karthik and Hima miss each other - Tellyexpress
Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published.