దళితుల మీద ప్రేముంటే-యదాద్రిలో దళిత పూజారిని నియమించండి

యాదాద్రిలో దళిత పూజారిని నియమించాలని తెలంగాణ ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్ మాట్లాడారు. దళిత ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇస్తానని నమ్మించి మోసం చేసినట్టుగానే 10 లక్షల ఆర్థిక సాయమని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ లో దళితుల ఓట్ల కోసమే ఒక బూటకపు హామీ అని విమర్శించారు. కెసిఆర్ కు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే కేరళ, తమిళనాడు తరహాలో దళిత పూజారిని చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. దళిత సాధికారత అంటే వాళ్ళ హక్కులను కాపాడటం, రాజ్యాధికారంలో భాగస్వాములను చెయ్యమే నిజమైన సాధికారత అని సూచించారు. తెలంగాణలో ఉద్యమకారులే నిజమైన ప్రతిపక్షమన్న చెరుకు సుధాకర్… ఉద్యమకారులంత ఒక వేదికపై వచ్చి నియంత పోకడలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ లో ఈటెలను ఓడించడానికి టీఆర్ఎస్ సామ, భేద, దండోపాయలను ప్రయోగిస్తుందని ఆరోపించారు. దళిత సాధికారతపై అఖిల పక్షం మీటింగ్ పెడితే మంద కృష్ణని ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఈ సమావేశంలో ఇంటి పార్టీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, కార్యదర్శులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, బత్తుల సోమన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కుందూరు దేవేందర్ రెడ్డి, యువజనవిభాగం అధ్యక్షులు సందీప్ చమార్, రామన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.