రేవంత్ కు టీపీసీసీ- మెరుగైన ఛానెల్ కి కడుపు మండుతోందా…?

ఎంపీ రేవంత్ రెడ్డి అంటే అంతెత్తున లేచే ఆయన విమర్శకులు గుప్పించే వార్తలకు మెరుగైన ఛానెల్ చాలా స్పెస్ ఇఛ్చి మరీ ఆయనపై బురదజల్లెది. రేవంత్ కబ్జాకోరు, మోసగాడు అంటు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రత్యేక కథనాలు ప్రసారం చేసి ఆయనకు కాంగ్రెస్ లో పదవులు రాకుండా విశ్వప్రయత్నం చేయిం చిందనేది బహిరంగ రహస్యమే. ఆయనకు టీపీసీసీ ఖాయమని లీకులు వచ్చిన ప్రతిసారి…రేవంత్ పై విరుచుకుపడే సొంత పార్టీ నేతల మీడియా సమావేశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్ఛేది. గంటల తరబడి ఆ ప్రెస్ మీట్ ను ప్రసారం చేసి రేవంత్ పై అక్కసు వెళ్ళగక్కిందనేది రేవంత్ మద్దతుదారులు ఆరోపణ. మొన్న కూడా రేవంత్ కు టీపీసీసీ ఖాయమని వార్తలు రాగానే…వీహెచ్ మీడియా సమావేశాన్ని గంటల పాటు కొనసాగించి మరోసారి రేవంత్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు చివరి క్షణం వరకు మెరుగైన చానెల్ కష్టపడింది కానీ, వారి ఆశలు ఆడియాశలు అయ్యాయి. జనాకర్షక నేతకే టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ లో నూతనోత్తేజం కనిపిస్తోంది. టీఆర్ఎస్ వ్యతిరేకులకు రేవంత్ టీపీసీసీ నియామకం ద్వారా కొత్త ఆశలు రెక్కలు తొడుక్కుంటే…మెరుగైన ఛానెల్ కు మాత్రం కడుపు మండుతోంది అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *