కోమటిరెడ్డి సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయా..?

కోమటిరెడ్డి సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయా..? అంటే అవుననేలా సమాధానాలు వస్తున్నాయి. ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ అద్యక్ష బాధ్యతలు అప్పగించడంతో అన్నయ్య వెంకట్ రెడ్డి భగ్గుమంటే…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం టీపీసీసీ ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందంటూ భిన్నంగా స్పందించాడు. డబ్బులు తీసుకొని పీసీసీ పోస్ట్ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వెంకట్ రెడ్డి. ఇదివరకే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ జరుగుతున్న పరిణామాలతో బీజేపీలోకి వెళ్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్నదమ్ములిద్దరూ అలక పాన్పు ఎక్కి…దీనిని సాకుగా చూపి బీజేపీలోకి వెళ్తారని ఊహించారు. కాని రాజగోపాల్ రెడ్డి , వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా స్పందించాడు. పీసీసీ ఎంపిక ఇంత పార‌ద‌ర్శ‌కంగా ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని, పార్టీ క్యాడ‌ర్ నుండి డీసీసీల వ‌ర‌కు, ప్ర‌తి ఒక్క నేత నుండి అభిప్రాయాన్ని తీసుకున్న‌ట్లు రాజ‌గోపాల్ రెడ్డి తెలిపారు. దీంతో కోమ‌టిరెడ్డి సోద‌రుల మ‌ధ్య విభేదాలున్నాయా… అందుకే అన్న కాంగ్రెస్ చీఫ్ పోస్టు ఆశిస్తే త‌మ్ముడు బీజేపీకి వెళ్తా అన్నాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *