కేసీఆర్ ట్రాప్ లో టి. కాంగ్రెస్ నేతలు…?

తెలంగాణ కాంగ్రెస్ నేతలు తాజాగా సిఎం కేసీఆర్ ను కలవడం పట్ల రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్… సడెన్ గా అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి..?అని చర్చాపచర్చలు నడుస్తున్నాయి. హుజురాబాద్ బైపోల్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ అధినేత ట్రాప్ లో పడ్డారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సిఎం కేసీఆర్ వ్యూహాలు అంత తొందరగా ఎవ్వరికీ అర్థం కావు. అవి విపక్షాలకు అర్థం అయ్యే లోపు అవ్వాల్సిన డ్యామేజ్ అయి తీరుతోంది. ఆయన వ్యూహాలను అర్థం చేసుకోకపోతే రాజకీయ ప్రత్యర్ధులకు భవిష్యత్ కూడా ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలాంటి ట్రాప్‌లోనే పడ్డారు.ఎన్నాళ్ళుగానో కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వని కేసీఆర్..తెలంగాణా ఏర్పడిన తరువాత తొలి సారి వారికి వారికీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కేసీఆర్ ప్రగతి భవన్ గేట్లు తెరిచారనే ఆనందంతో.. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి వంటి ముఖ్య నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లారు. కొద్ది రోజుల కిందట మరియమ్మ అనే మహిళ యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్‌కు గురయ్యారు. ఈ అంశం తెలంగాణలో రాజకీయం అవుతోంది. కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువేల్లెందుకు సీఎం అపాయింట్‌మెంట్‌ను కాంగ్రెస్ నేతలు అడిగారు. కేసీఆర్ వెంటనే ఇచ్చేశారు. కానీ ముందూ వెనుకా ఆలోచించకుండా కాంగ్రెస్ నేతలు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. మరికొన్ని నెలల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌తో భేటీ అవడం తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం కనిపిస్తోంది. అదే సమయంలో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా జరిగే పరిస్థితి ఉంది. తాము పోటీలో ఉన్నామని కాంగ్రెస్ నిరూపించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా.. కేసీఆర్‌తో భేటీ కావడంతో.. పొలిటికల్ సీన్ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ కు నష్టం కాగా.. కేసీఆర్ కు మాత్రం ప్రయోజనమేనని చెబుతున్నారు విశ్లేషకులు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.