పరీక్షా ఫలితాలపై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఫలితాల విడుదలపై దృష్టి పెట్టింది. ఈమేరకు విద్యాశాఖ అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్షా ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలనీ మంత్రి అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఫలితాల విడుదలకు జూలై 31వరకు గడువు విధించిన నేపథ్యంలో…గడువుకు ముందే పరిక్షా ఫలితాలను విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో సాల్ట్ కార్యక్రమం, విద్యా కానుక అంశాలు, అకడమిక్ క్యాలెండర్‌, పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రి సురేష్‌ చర్చించారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *