AP Government Decided to Cancel Board Exams ? పరీక్షలను రద్దు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ?|Tv6 Telugu

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను మానసిక ఆందోళన గురి చేస్తోంది ప్రభుత్వం. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ లేకపోవడంతో పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఇంతకీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా..? జరగాయా..? జరిగితే ఎలా నిర్వహిస్తారు..? ఎప్పుడు నిర్వహిస్తారు..? అని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. పక్క రాష్ట్రాల్లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వం కనుక పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాలని భావిస్తే నేరుగా తేదీని ప్రకటించి…ఆయా రోజుల్లో పరీక్షలను నిర్వహిస్తామని పరీక్షలపై స్పష్టత ఇవ్వాలి. కాని ఏపీ సర్కార్ ఇందుకు భిన్నంగా పరీక్షలను నిర్వహిస్తామని చెబుతుందే కాని, ఓ తేదీని మాత్రం ప్రకటించనేలేదు. కరోనా కల్లోలం కొనసాగుతున్న ఈ సమయంలో పరీక్షలను ఏ తేదీన నిర్వహించాలో తెలియని సందిగ్ధంలో ప్రభుత్వం ఉంటె…విద్యార్థులు పరీక్షల నిర్వహణపై డైలామాలో ఉండిపోరా..?ఈ పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించాలని విద్యానిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు థర్డ్ వేవ్ అనే భయం వెంటాడుతోంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలపై ప్రభావం చూపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం సైతం థర్డ్ వేవ్ భయం నేపథ్యంలోని ముందుగానే అలర్ట్ అయ్యింది. స్వయంగా సీఎం జగనే థర్డ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను సూచించారు. అంటే థర్డ్ వేవ్ ఉంటుందనే భయం ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సరైన నిర్ణయం అనే ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా ఏపీలో పది ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.. మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లలో పరీక్షలు నిర్వహిస్తామని నొక్కి చెప్పేవారు.. తాజాగా ఆయన మాటల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ఏపీలో అప్పటి పరిస్థితుల బట్టి పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అంటే పరిస్థితులు అనుకూలించడం లేదని పరీక్షలు వాయిదా వేసేందుకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆగస్టు నుంచి కొత్త విద్యా సంవస్థరం ఆరంభమయ్యే అవకాశం ఉంటుంది.. అంటే జులై వరకు కరోనా కేసులు తగ్గుతాయనే స్పష్టత లేదు. అంతే కాదు థర్డ్ వేవ్ రూపంలో మరో భయం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో జులైలో పరీక్షలు నిర్వహణ కత్తిమీద సామే.. అలా అని ఇంకా లేటు చేస్తే అన్ని రాష్ట్రాల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ఏపీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అప్పుడు పరీక్షలు అంటే విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు పరీక్షలు రద్దు చేయడమే బెటరని సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. చాలామంది ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణ కోసం విధుల్లోకి రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే సెకెండ్ వేవ్ లో భారీగా ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాము రిస్క్ చేయలేమని అంటున్నారు.
మరో వైపు పరీక్షల రద్దు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి. అటు కేంద్ర పెద్దలకు సైతం లేఖలు రాస్తూనే ఉన్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు. మరోసారి ఏపీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిపుణుల నుంచి ఆయన అభిప్రాయప సేకరణ చేపడుతున్నారు. సుమారు ఐదు లక్షల మంది తన వాదనతో ఏకీభవించారని.. పరీక్షలు రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారని లోకేష్ అంటున్నారు
ఏదీ ఏమైనప్పటికే విద్యాశాఖ మంత్రి మాట్లాడిన తీరు చూస్తె పరీక్షలు రద్దవుతాయనే అంతా భావిస్తున్నారు విద్యార్ధి లోకం. లోకేష్ చేసిన పోరాటానికి న్యాయం జరిగిందని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలకు శుభం కార్డు పడినట్లే.
Load More Related Articles
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *