తెలంగాణ రాజకీయాలు ఈటల వ్యవహారంతో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారని..ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఈటల మౌనంగా ఉండటంతో ఎపుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోననే ఉత్కంట నెలకొంది. ఈటల బీజేపీలో చేరితే కమలం పార్టీ మరింత బలపడటం ఖాయం. సో.. బీజేపీలో చేర్చుకోవడం కోసం ఢిల్లీపెద్దలు ఈటలతో భేటీ అయ్యారని…ఈటలకు రాజ్యసభ, ఆయన భార్యకు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినట్లు బీజేపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఈ వార్తలన్నీ షికార్లు చేస్తుండగానే ఈటలతో జన సమితి అధినేత కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
ఈటలను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన టైంలో… ఉద్యమ శక్తులుగా ఉన్న వీరంతా కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. కొండా కూడా ఇదే అంశాన్ని చెప్తూ వచ్చారు. కొండా ఇదివరకే ఈటలతో భేటీ అయినా..ఇప్పుడు కోదండరాం కూడా ఈటలతో భేటీ అవ్వడం చర్చనీయంశంగా మారింది. ఈ ముగ్గురి భేటీ కావడంతో ఈటల బీజేపీలోకి వేల్తారనే ప్రచారం అవాస్తమని తెలుస్తోంది. ఎందుకంటే వామపక్ష భావజాలం ఉన్న కోదండరాం అయితే బీజేపీలో చేరే పరిస్థితి లేదు….కనుక కొత్త పార్టీ పెట్టి, ఉద్యమ శక్తుల పునరేకీకరణకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నదే ఈ భేటీ ఉద్దేశ్యమని, ఈటల బీజేపీలోకి వెళ్తే పెద్దగా లాభం ఉండదని చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి సారధ్యంలో కొత్త పార్టీ పెడితే అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలతోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలో ఉన్న ఉద్యమకారులంతా కలిసి వస్తారని కొండా, కోదండరాం ధీమాగా ఉన్నారు. వీరి భేటీ ఆనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…ఐక్య వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నామనే ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెనక కొత్త పార్టీ ఏర్పాటు ఉద్దేశ్యం ఉందని చెప్పకనే చెప్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు.