తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. 234 స్థానాలకు గాను 133 చోట్ల జయకేతనం ఎగురవేసింది. అన్నాడీఎంకే 66, కాంగ్రెస్ 18, పీఎంకే 5, భాజపా 4 స్థానాలకే పరిమితమయ్యాయి.