పోరాటం గెలిచింది..సర్కార్ తలవంచింది.

ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఫైనల్లీ…పరీక్షలను వాయిదా వేస్తున్నామని…రాష్ట్రంలో కోవిడ్ ఉదృతి తగ్గుముఖం పట్టాక పరీక్షల రీ-షెడ్యూల్ ను ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలతో కలిసి tv6 ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతోపాటు…చివరకు హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణ విషయంలో వెనుకడుగు వేసింది. దేశంలో కోవిడ్ ఉగ్రరూపం చూపిస్తోన్న సమయంలో సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని ఎకిపారేసింది. దేశంలో కోవిడ్ ఉద్రుతికి మీరే కారణమని….ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు అంతా అవసరమా..?ఎన్నికలు కొంతకాలం వాయిదా వేస్తె మిన్ను విరిగి పడుతుందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే…తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టు ఆగ్రహాన్ని చవిచూసింది. కోవిడ్ కట్టడికి 45 నిమిషాల్లో ఏ నిర్ణయం తీసుకుంటారో మీరు చెబుతారా.. లేక మేమే ఆదేశాలివ్వాలా అంటూ సీరియస్ కావడం.. వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వారం రోజులపాటు నైట్ కర్ఫ్యూను పొడిగించడం చకచక జరిగిపోయాయి. ఇలా ప్రభుత్వాలు, వ్యవస్థలు న్యాయస్థానాల ఆగ్రహానికి గురి అవుతున్నా.. ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుబడి ఉందంటూ సీఎం జగన్ ప్రకటించడం ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఈ సమయంలో వేలాది మంది విద్యార్థులు tv6ను సంప్రదించడంతో పరిక్షల వాయిదాను నెత్తినకెత్తుకుంది. విద్యార్థుల ఆవేదనను అర్తం చేసుకున్న tv6 విద్యార్థులకు నిర్వహించబోయేది పరీక్షలా..?లేక శిక్షలు విధిస్తుందా..? అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వంపై ఒత్తిడిని క్రమక్రమంగా పెంచింది. అదే సమయంలో నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కెఏ పాల్ వంటి నేతలు కూడా పరిక్షలను వాయిదా వేయాలంటూ దశలవారీగా ఒత్తిడి పెంచారు.

voice over : మరోవైపు.. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తుండడంతో హైకోర్టు, సుప్రీం కోర్టులు కరోనా కట్టడి విషయంలో స్పందిస్తున్న తీరుతోపాటు..విద్యార్థులు ఆందోళనలపై tv6 వరుస కథనాలతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అలాగే నేడు కోర్టులో విచారణ జరగనున్న నేపధ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని tv6 ముందుగానే హెచ్చరించింది. దీంతో విషయాన్నీ ముందే గుర్తించిన ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ విషయంలో పలు మార్లు కోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే పరీక్షల విషయంలోనూ మరోసారి కోర్టు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని..అదే సమయంలో కోర్టులో ప్రభుత్వ ధోరణిపై ఆక్షింతలు పడితే అది విపక్షాలకు మరింత అడ్వాంటేజ్ గా మారుతుందని గ్రహించింది ప్రభుత్వం. దీంతో ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్ట్టు ప్రకటించి విద్యార్థులకు బిగ్ రిలీఫ్ ను ఇచ్చింది ప్రభుత్వం. లేదంటే..15 ల‌క్షల మంది విద్యార్థులు, ప‌రీక్ష నిర్వహించే 30 వేల‌ మంది ఉపాధ్యాయులు, ల‌క్షలాది కుటుంబ‌ స‌భ్యుల శాపనార్తలను సర్కార్ చవిచూసి ఉండేది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.