కేటీఆర్ కు ఆ సలహా ఇచ్చిన మంచు లక్ష్మి.. విపరీతమైన ట్రోల్స్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా సోకింది. ఆ విషయాన్ని ఆయనే సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసారు. తనకు జరిపిన టెస్టుల తరువాత కరోనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం కేసీఆర్ కు పాజిటివ్ రాగా, ప్రస్తుతం ఆయన తమ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.కేటీఆర్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేయగానే.. పలువురు ప్రముఖులు వీలైనంత త్వరగా మీరు కోరుకోవాలంటూ ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా ఓ ట్వీట్ చేశారు. అయితే అది కాస్తా భారీ ట్రోల్స్ కు దారితీసింది. ‘మిత్రమా కేటీఆర్ నువ్వు త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసేయ్’ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది.అయితే మంచు లక్ష్మి ఆ కామెంట్ చేయడం ఆలస్యం ఇక భారీగా ట్రోల్స్ మొదలయ్యాయి.

‘అసలే ఆయన అనారోగ్యంతో ఉంటే.. మీ సినిమాలు చూడమంటారా.. ఇంకేమైనా ఉందా.?’.. అంటూ చెప్పుకొచ్చారు.

‘కరోనాతో పోరాడుతున్న సమయంలో మీ సినిమాలు చూస్తే ఇంక అంతే సంగతులు’ అంటూ సెటైర్లు మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. స్వల్పలక్షణాలతో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వాళ్లు దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి అంటూ కేటీఆర్ ట్వీట్‌లో చెప్పారు. కరోనా పాజిటివ్‌గా రావడంతో తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు కేటీఆర్ చికిత్స పొందుతున్నారు.

కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలతో పాటు, అభిమానులు, మిత్రులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి ట్వీట్ చేయడం.. ఆమె మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. కరోనా కారణంగా పలువురు రాజకీయ నాయకులు కూడా ఆసుపత్రుల పాలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *