తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్ వేవ్‌లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో 33 మంది ప్రాణాలను కోల్పోయారు. మహమ్మారి బారి నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఒక జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 1,464 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌లో 606, రంగారెడ్డి 504, నిజామాబాద్ 486, ఖమ్మం 325 వరంగల్ అర్బన్ 323, మహబూ