గుంటూరు జిల్లాలో ట్రాలీ బోల్తా… 10 మందికి తీవ్రగాయాలు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయరహదారిపై గురజాల మండలం పులిపాడు నుంచి మిర్యాలగూడ అన్నారం తండాకు మిర్చికోతకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తూ అశోక్ లైలాడ్ ట్రాలీ బోల్తా పడింది. దీంతో పదిమంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి ఎస్ఐ బాల నాగిరెడ్డి, పోలీసు సిబ్బంది విచారణ చేపట్టారు.

Load More Related Articles
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *