సీనియర్ జర్నలిస్ట్ అమరనాథ్ కన్నుమూత

పాత్రికేయ ఉద్యమనేత అమరనాథ్ కన్నుమూశారు.. ఆయన మృతిపట్ల పలువురు సీనియర్ జర్నలిస్టుల, మంత్రులు, అధికారులు తీవ్ర సంతాపం తెలిపారు. జాతీయ ఉద్యమ పితామహుల్లో ఒకరైనా సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు కోసూరి అమరనాథ్ మరణం పట్ల ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టుకు కొండంత అండగా ఉంటూ.. సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో చర్చించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారంకు కృషిచేశారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ కోసం నిరంతరం పోరాటం సాగించిన ఒక మంచి మార్గదర్శి అమరనాథ్ ను కోల్పోడం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా జాతీయస్థాయిలో జర్నలిస్ట్ లకు తీరనిలోటు అని తెలిపారు. అమర్ నాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Load More Related Articles
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *