భద్రాచలం మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి….


కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం శ్రీరామ నవమి ఉత్సవాలు గత సంవత్సరం చేసినట్లే రామాలయం లోపలే కొద్దీ మంది పూజారుల సమక్షంలో జరుపబడును. కావున ప్రజలు ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరూ కూడా రామాలయంనకు రాకుండా ఇంటి వద్దనే పూజలు చేసుకొని పోలీసు వారికి మరియు రామాలయ సిబ్బందికి సహకరించగలరు అని మనవి చేస్తున్నాము.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలో మాస్క్ ధరించని 300 మందికి 1000/- రూపాయలు జరిమానా చొప్పున 3,00000/- రూపాయలు విధించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్నీ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయంలో ఎవరూ బయటకు రాకుండా కోవిడ్ నిభందనలు పాటిస్తూ పోలీస్ సిబ్బందికి సహకరించగలరు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *