లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తారా ? లేదా, హైకోర్టు సంచలనం !

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణ సంధర్భంగా 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టీస్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని పేర్కొన్న హైకోర్టు ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్ లో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని ఎవరినైనా నియమించాలని హైకోర్టు ఆదేశించింది.

Health.telangana.gov.in వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలన్న హైకోర్టు పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ మంది గ్యాదర్ ఐతే వారి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డీజీపీ, ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదని మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది. ఇంటర్ స్టేట్ సరిహద్దుల్లో టెస్టులు చేయాలన్న హైకోర్టు22న స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.

Load More Related Articles
Load More By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *