పడిపోయిన టమాటా ధర- బేజారవుతున్న రైతన్నలు

చాలా రోజుల తర్వాత మళ్లీ టమాటా ధరలు పడిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లలో కిలో టమాటా 10 నుంచి 20 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం మే మాసంలో నీటి కొరత కారణంగా టమాటా ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం నీటి కొరత లేక పోవడంతో పెద్దయెత్తున రైతులు టమాటా పంట పండించారు. తీరా మార్కెట్‌కు తీసుకు వస్తే గిట్టుబాటు ధర రాక దిగాలు పడుతునారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక రాష్ర్టాల్లోనూ టమాటా ఉత్పత్తి బాగా ఉండడంతో హైదరాబాద్‌కు దిగుమతి చేస్తున్నారు. దీంతో ధర బాగా పడిపోయింది. నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్టయిన గుడిమల్కాపూర్‌, ఎల్‌బి నగర్‌, బోయిన్‌పల్లి, రమాదన్నపేట, సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌తో పాటు రైతు బజార్లకు పెద్దమొత్తంలో టమాటా దిగుమతి జరుగుతోంది.

సాధారణ రోజుల్లో నగరానికి రోజుకు 80 లారీల వరకు టమాటా దిగుమతి అవుతుండగా ప్రస్తుతం 120 నుంచి 130లారీల వరకూ దిగుమతి అవుతున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో 10 కేజీల టమాటా బాక్స్‌ 80 నుంచి 120 రూపాయలకు అమ్ముతున్నారు. రిటైల్‌ వ్యాపారులు కిలో 10 నుంచి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. కాగా ఎంతో కష్టించి పండించిన పంటకు సరైన ధర రావడం లేదని చేవెళ్ల నుంచి నగరానికి టమాటా తీసుకు వచ్చే నారాయణ విచారం వక్యక్తం చేశారు. టమాటా మార్కెట్‌కు తీసుకు వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే మెదక్‌ నుంచి నగ రానికి టమాటా తీసుకు వస్తున్న ఆంజనేయులు కూడా తాను ఎంతో కష్టించి పండించిన పంటకు ధర రావడం లేదనివిచారం వ్యక్తం చేశారు. భారీగా పంట దిగుబడి రావడం వల్లనే ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే సాదారణ ప్రజలు మాత్రం టమాటా ధర తగ్గడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.