పుట్టినరోజు వేళ చంద్రబాబు కీలక నిర్ణయం… మనసులో మాటపై కార్యకర్తలకు లేఖ

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు లేక రాశారు. ఏప్రిల్ 20 (మంగళవారం) చంద్రబాబు నాయుడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు లేఖరాసిన ఆయన.. అభిమానులు, కార్యకర్తలెవ్వరూ రేపు తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈమేరకు తన లేఖను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. “నా పుట్టినరోజుకు ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి మీరంతా చేపట్టే కార్యక్రమాలు అభినందనీయం. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు కొవిడ్-19 నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. అందుకే నా పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి మీరంతా ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకిచ్చే జన్మదిన కానుక.” అని పేర్కొన్నారు.

చంద్రబాబు బర్త్ డేను ప్రతి ఏడాది భారీగా ప్లాన్ చేసే టీడీపీ కార్యకకర్తలు, నేతలు ఆయన ట్వీట్ తో డీలా పడ్డారు. మరోవైపు కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ఆన్ లైన్లోనే నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కూడా పార్టీ నేతలతో జూమ్ యాప్ ద్వారానే సమావేసమవుతున్నారు. గత ఏడాది మహానాడు కార్యక్రమాన్ని కూడా ఆన్ లైన్లోనే నిర్వహిచారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *