దేశంలో ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండు వేసవిలోనూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులు మంచి పంటలు పండుతున్నాయని ఆయన అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం బొక్కలోనిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలో పాలమురు -రంగారెడ్ది ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలిపారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.