ఆర్థిక లావాదేవీల్లో సమస్య.. సీసీఎస్‌కు నరేశ్‌ ఫిర్యాదు

సీనియర్‌ నటుడు నరేశ్‌ స్టోన్‌ ఇన్‌ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్‌ తమకు ఇవ్వాల్సిన పదికోట్ల రూపాయల మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వీడియో కూడా నరేశ్‌ విడుదల చేశారు.

వీడియోలో వీకే నరేశ్ మాట్లాడుతూ “లింగం శ్రీనివాస్‌.. స్టోన్‌ ఇన్‌ఫ్రా సహా రెండు, మూడు కంపెనీలు స్టార్ట్‌ చేశారు. మా బిల్డర్‌ ఫినిక్స్‌తో ఈయన అసోసియేట్‌ అయ్యి సైనింగ్ అథారిటీలో ఉన్నారు. ఈయన మా ఫ్యామిలీ దగ్గర ఆరేళ్ల ముందు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. మా మేనమామ రఘునాథ్‌ ద్వారా అప్పు తీసుకున్నారు. ఇన్నేళ్లు మాకు ఎటువంటి రిటర్న్స్‌ కూడా ఇవ్వలేదు. మేం చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి నేను సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కూడా అప్రోచ్‌ అయ్యాను. ఇంతకు ముందు విజయవాడకు తీసుకెళ్లి తప్పించుకున్నాడు. ఇప్పుడు దాదాపు పదికోట్ల రూపాయలకు పైగానే మాకు రావాలి. తెలంగాణ పోలీసులు, సెంట్రల్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌వారు వెంటనే స్పందించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *