గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు వివేక్‌

ప్రముఖ తమిళ హాస్యనటుల్లో ఒకరైన వివేక్ గుండెపోటుతో మద్రాసులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఎన్నో తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. గురువారం ఆయన కొవిడ్‌ టీకా తీసుకొన్నారు. ‘ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన కోరారు. ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ వచ్చాయి. ‘అపరిచితుడు’లో విక్రమ్‌ స్నేహితుడిగా, ‘వీఐపీ2’లో ధనుష్‌ సహచరుడిగా ‘స్వర్ణపుష్పం’ అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించారు. హీరో సూర్యతో కలిసి ‘సింగం 2’లో ఎస్‌ఐ పాత్రలో మెప్పించారు. ‘బాయ్స్‌’ చిత్రంలోనూ నటించారు.

Load More Related Articles
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *