ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ప్రస్తుతం మిషన్ మజ్ను సినిమాతోపాటు అమితాబ్ బచ్చన్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం కొట్టేసింది రష్మిక. గుడ్‌బై టైటిల్‌తో తెరకెక్కనుందీ చిత్రం.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో సినిమా చేసే ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయంపై స్పందిస్తూ..అమితాబ్ బచ్చన్ అంటే గౌరవానికి కేరాఫ్ అడ్రస్. ఆయనో సూపర్ స్టార్. నేను బిగ్ బీతో నటిస్తున్నానంటే నా పేరెంట్స్ నమ్మలేదు. అందరిలాగే అమ్మానాన్న కూడా బిగ్‌బీ వీరాభిమానులు. నేను చిన్ననాటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నిజంగా బిగ్‌బీతో నటించే ఛాన్స్ రావడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందంటూ చెప్పుకొచ్చింది.