ఫోన్‌ చేస్తే 3 గంటల్లోగా బెడ్‌ కేటాయించాలి

ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6.21 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది అందరూ సమష్టిగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రోజుకు 6 లక్షల వాక్సిన్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించామని, ఇక ముందు కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాక్సిన్లు లేనందున వాటి కోసం లేఖ రాయమని అధికారులకు సూచించారు. అవసరం అనుకుంటే తాను కూడా లేఖ రాస్తానని చెప్పారు. కోవిడ్‌ నివారణ,కరోనా వ్యాక్సిన్ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. 

104 నెంబరు కోవిడ్‌ సేవల కోసం, 1902 నెంబరు గ్రీవెన్సుల కోసం కేటాయించండి. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి. కోవిడ్‌కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్‌ చేయాలని బాగా ప్రచారం చేయండి. దీన్ని కూడా ఇవాళ్టి నుంచి ప్రచారంలో చేర్చండి. అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ వంటి పబ్లిక్‌ ప్లేసెస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండి. కోవిడ్‌ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ వరకు.. ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలి.

ఆస్పత్రి కేర్, శానిటేషన్, నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్‌ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా చూడాలి. క్వాలిటీ ఆఫ్‌ మెడికేషన్‌తో పాటు, సమయానికి మందులు అందించడం అన్నది కూడా చాలా ముఖ్యం. అన్ని ఆస్పత్రులలో ఇవన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలి. అందుకోసం ఆస్పత్రులలో వాటిని పరిశీలించడానికి గతంలో మాదిరిగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. జిల్లాలలో కూడా ఆ ఏర్పాటు జరగాలి.


టెస్టింగ్‌ చాలా ముఖ్యం. కోవిడ్‌ పేషెంట్‌ ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో కూడా పరీక్షలు చేయాలి. పరీక్ష చేయించాలనుకున్న ఎవరైనా వెళ్లి, దాన్ని చేసుకునే విధంగా ప్రతి పీహెచ్‌సీలో తగిన ఏర్పాటు చేయాలి. ఇంకా 104కు ఎవరైనా ఫోన్‌ చేసి, తాము పరీక్ష చేయించుకోవాలని అనుకుంటున్నామని చెబితే, వారు ఎక్కడికి పోవాలన్నది గైడ్‌ చేయాలి. అందువల్ల పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్‌ లేదా విలేజ్‌ క్లినిక్‌.. ఎక్కడైనా సరే పరీక్ష (అది కావాలని కోరుకునే వారికి.. తమకు కోవిడ్‌ వచ్చిందని భావించే వారికి) చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.