పోలీసు కమాండోలా ? కేసీఆర్ కి కాపలా కుక్కలా ? .. టీఆర్ఎస్ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు – దాసోజు శ్రవణ్

” ప్రజాస్వామ్య హక్కుకు ప్రతీక, రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పుట్టినరోజున దళితులపై జరిగిన దాడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన మరో నిదర్శనం” అని వ్యాఖ్యానించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ . నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఓయూ దళిత విద్యార్ధి నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్ పై జరిగిన పాసవికమైన దాడిని తీవ్రంగా ఖడించించారు దాసోజు. ఈ ఘటన పై హైదరాబద్ లోని గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, దళిత నాయకుడు నరికెళ నరేష్ తదితరులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ‘’కొంతమంది టీఆర్ఎస్ గూండాలు, పోలీసులు కుమ్మక్కై .. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత హోటల్ లో విశ్రాంతి తీసుకుంటున్న దళిత విద్యార్ధి నాయకుడు, గత ఏడేళ్ళుగా నిరుద్యోగ జేఏసీ ద్వారా తెలంగాణ నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న తెలంగాణ దళిత బిడ్డ మానవతా రాయ్ పై విచ్చలవిడిగా దాడి చేయడం సోషల్ మీడియాలో వీడియోలతో సహా బయటపడింది. ప్రజలు చూశారు. అంబేద్కర్ పుట్టిన రోజున దళిత బిడ్డపై దాడి. ఈ ఒక్క ఘటన చాలు కేసీఆర్ కి దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీల పట్ల ఏ రకమైన ప్రేమ వుందో చెప్పడానికి’’ అని తెలియజేశారు దాసోజు.

‘’కోర్టులో కేసులు వేస్తె అడ్వకేట్లని కూడా చూడకుండా హత్యలు చేస్తారు. మా హక్కులు మాకు కల్పించండని ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారు. ఆఖరికి రాజ్యంగ కల్పించిన హక్కుని వాడుకొని ఎన్నికల్లో ప్రచారం చేస్తే కూడా పాసవికమైన దాడులు చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎందుకింత నీచానికి దిగజారుతున్నారు ? ప్రజాస్వామ్య విప్లవం ద్వారా తెలంగాణ తెచ్చుకుంటే .. అదే ప్రశ్నించే గొంతుకల మీద దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ’’ అని సూటిగా ప్రశ్నించారు దాసోజు.


‘’నాగార్జున సాగర్ లో కేసీఆర్ లక్ష మందితో మీటింగ్ పెడుతున్నారని చెప్పి మానవతా రాయ్ తో మహేందర్ యాదవ్ అనే మరో ఓయూ విద్యార్ధి నాయకుడ్ని అరెస్ట్ చేశారు. అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరించి దాడులకు తెగబడి ఎక్కడిక్కడ అబంధించారు. కోవిడ్ నిబంధనలని అతిక్రమించి కేసీఆర్ మీటింగ్ పెట్టవచ్చు. కేసీఆర్ మీటింగ్ పెడుతున్నారు కాబట్టి మిగతా పార్టీ వాళ్ళని జైల్లో పెట్టాలనేది ఏం న్యాయం ? కేసీఆర్ కి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం వుందా ? టీఆర్ఎస్ పార్టీకి ఇండియన్ పీనల్ కోడ్ వర్తించదా ? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కేసీఆర్ కి వర్తించదా ? ఏం పరిపాలన ఇది’’ అని సూటిగా ప్రశ్నించారు దాసోజు.

తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి దళితుల గొంతు కోశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి వారి ఓట్లు గుంజుకొని మభ్యపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ తెస్తే నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారు. తెలంగాణ ఉద్యమం అంటేనే ధూమ్ ధాం . కాళ్ళు గజ్జే కట్టి ఆటలాడి పాటపాడి తెలంగాణ తెచ్చిన దళిత బిడ్డలు ఇవాళ ఆత్మ గౌరవం కూడా లేకుండా అణిచివేయ బడుతున్నారు. ఆఖరికి వారికి ఎన్నికల్లో ప్రచారం చేసే హక్కుని కూడా లేకుండా చేసి పాశవికమైన దాడులకు పాల్పడుతున్నారు? ఇదేం ఆటవిక పాలన?’’ అని ప్రశ్నించారు దాసోజు.

‘’తెలంగాణ చైతన్యకి మారుపేరు. పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం చేసిన గడ్డ. కేసీఆర్ పోలీసులని అడ్డం పెట్టుకొని ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణిచివేయాలని చూస్తే .. మీ పప్పులు ఉడకవు . ప్రశ్నించే గొంతుకని అణిచివేయాలని చూస్తే అదే మీ పతనానికి నాంది. త్వరలోనే టీఆర్ఎస్ పతనం’’ అని హెచ్చరించారు దాసోజు.
‘’మానవతా రాయ్ పై దాడి తో పాటు మరో సంఘటన. రాజ్యాంగం పై ప్రమాణం చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి .. ‘’నిన్ను, నీ నాయకుడ్ని తొక్కుతాం’’ అని ఓ లంబాడి బిడ్డని హెచ్చరించారు. అతడు చేసిన తప్పు ఏమిటంటే..’మాకు ఉద్యోగాలు కల్పించండి. చనిపోయిన సునీల్ నాయక్ కు న్యాయం చేయండి’’ అన్న పాపానికి లంబాడి గిరిజన బిడ్డని తొక్కి చంపుతామని ఒక మంత్రి అలా బెదిరించడం ఏం అరాచకమో టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి? అలాగే టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు కూడా దీనికి సమాధానం ఇవ్వాలి. పోలీసులా ? టీఆర్ఎస్ పార్టీ పాలెగాళ్ళ ? తొక్కుతాం చంపుతాని బెదిరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కేసు పెట్టాలి. కానీ మాకు ఉద్యోగం ఇవ్వండి. న్యాయం చేయండని అడిగిన ఓ అమాయక లంబాడి బిడ్డల పై దాడి చేయడం దేనికి నిదర్శనం ? అసలు ఏం రాజ్యం ఇది ? మీరు పోలీసు కమాండోలా ? లేదా కేసీఆర్ కి కాపలా కుక్కలా ? అని తీవ్రంగా ప్రశ్నించారు.


‘’మానవతా రాయ్ పై దాడి చేసిన ఎస్ఐ పై ఇంత వరకూ కేసు పెట్టలేదు. ‘తొక్కుతాం’’ అని బెదిరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని అటు ఎన్నికల కమీషన్ గానీ ఇటు పోలీసులు కానీ ఇది తప్పు అని చెప్పలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ డీజీపీ కి ఓ లేఖ రాశాం. మానవతా రాయ్ పై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు ఎలా దాడి చేశారో లేఖలో వివరించాం. మానవతా రాయ్ విద్యార్ధి కావచ్చు, డబ్బులేని వాడు కావచ్చు, కానీ అతను తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శి , తెలంగాణ సాధన కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి, గత ఏడేళ్ళుగా నిరుద్యోగుల పోరాట గొంతుక. అలాంటి వ్యక్తిపైన దాడి చేయడం కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలపైన, ఎస్ఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిపై వెంటనే ఓ విచారణ వేసి విచారణ పూర్తయినంత వరకూ సదరు ఎస్ఐ ని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేయాలి. అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు దాసోజు శ్రవణ్.

’’కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరూ కూడా మనోధైర్యం కోల్పోవద్దు. పార్టీ అన్నీ వేళల మీ కోసం పాటుపడుతుంది. ఎంత ఒత్తిడి చేస్తే అంతకుమించిన ఉత్సాహంతో ఉవ్వెత్తున ఎగసిపడదాం. రాహుల్ గాంధీ మన మనకు అండగా వున్నారు. మనకు రాజ్యాంగం వుంది. ఈ దాడులకు ఎవరూ భయపడొద్దు. లొంగవద్దు’’ అని కోరారు దాసోజు.


‘’నాగార్జున సాగర్ లో నలఫై రోజులుగా దాదాపు టీఆర్ఎస్ నాయకులు, వేరే వేరే నియోజిక వర్గాలకు చెందిన వ్యక్తులు, బీర్లు, బిర్యానీలు, డబ్బులు పంచుతూ , ఓటర్లని మభ్యపెడుతూ తిరిగారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పధకాలు ఆపేస్తామని బెదిరించారు. ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఒక్క రూపాయిని కూడా ఎలక్షన్ కమీషన్ స్వాధీనం చేసుకోలేదు. కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల ప్రచారం చేసిన మానవతా రాయ్ పై మాత్రం విచ్ఛల విడిగా దాడి చేశారు. ఇదెక్కడి న్యాయం ? కేసీఆర్ లక్షల మందితో మీటింగ్ పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం చేసుకున్నప్పుడు, ఒక పార్టీ కార్యకర్త ఎన్నికల ప్రచారం చేసుకునే హక్కు లేదా ? ఇవేం చిల్లర రాజకీయాలు ? పోలీసులు రాజ్యంగానికి కాపలదారులుగా వుండాలి కానీ కేసీఆర్ కాదు’’ అని దాసోజు శ్రవణ్ సూచించారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.