మన్సురాబాద్ డివిజన్‎లో మాల సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు..

అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం… అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన గళం డాక్టర్ అంబేడ్కర్ అని కొనియాడారు మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి. మనిషిని, మనిషిగా చూసేందుకు నిరాకరించి అసమత్వంతో వేళ్ళూనుకుపోయిన సమాజానికి, సమానత్వంతో జీవించేలా హక్కులను ప్రసాందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అని అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్ లో రాజ్యంగా నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డితోపాటు, మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్ రెడ్డిలు హాజరై, బాబా సాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 130 ఏళ్ల కింద నేడు ఉన్నటువంటి పరిస్థితులు లేవని, నేటి ప్రజాసామ్యయుత వాతావరణానికి, సమానత్వంతో సమాజం వర్దిల్లాడానికి ప్రధాన కారణం అంబేడ్కర్ అని ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు. వర్ణ, కుల వివక్షల నిర్మూలనా విప్లవ నేత అని, అణగారిన వర్గాల రాజకీయ విముక్తికి మార్గదాత అని కొనియాడారు. మహిళల హక్కుల కోసం నిబద్ధతతో పోరాడి కేంద్ర న్యాయశాఖామంత్రి పదవిని గడ్డిపోచగా భావిస్తూ పదవిని వదులుకున్నాడని అంబేడ్కర్‌ త్యాగనీరతిని స్మరించుకున్నారు. ప్రతి చోట నిరాదరణకు గురైన అంబేడ్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి , ప్రపంచ దేశాల చేత మేధావిగా కీర్తింపబడటం గొప్ప విషయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో చెంగల్ దయానంద్, చెంగల్ ఆనంద్, చెంగల్ చంద్రమోహన్, చెంగల్ గిరిధర్, మోరుగుమల్ల ఈశ్వరయ్య, మోరుగుమల్ల విజయ్, బొల్లపల్లి జగన్, సురేష్ , మంజుల తదితరులు పాల్గొన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.