నెల్లూరు జిల్లాలో 276 కరోనా కేసులు… నలుగురు మృత్యువాత

నెల్లూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 276 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. గడచిన 24 గంటల్లో నెల్లూరజిల్లా వ్యాప్తంగా 1796 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 276 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసులు సంఖ్య 65వేలా 802కి చేరాయి. మరో వైపు నేడు కోవిడ్ తో నలుగురు మృత్యువాత పడ్డట్టు వెల్లడించారు. జిల్లాలో యాక్టివ్ కేసులు 2044 ఉండగా వారిలో 434 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు హోం ఐసోలేషన్ లో ఉన్నారన్నారు.

Load More Related Articles
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *