ఏప్రిల్ 22న ఒకటి కానున్న జ్వాల, విశాల్

నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 22న ఈ జంట ఒకటి కానుంది. సోషల్ మీడియా వేదికగా వివాహ ఆహ్వాన పత్రికని అభిమానులతో పంచుకున్నారు. ఎప్పటిలానే మీ ప్రేమ, సహకారం కావాలని విష్ణు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. గుత్తా 2005 లో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్ తో 2011 లో విష్ణు విశాల్ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *