సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభను రేవ్ పార్టీగా మార్చిందని ఆయన వ్యాఖ్యనించారు. రెండోసారి సీఎం కేసీఆర్ సభ అంటేనే ఓటమిని ఒప్పుకున్నట్టేనని రేవంత్ రెడ్డి చెప్పారు. జానారెడ్డి గెలుపు ఆయన కంటే తెలంగాణ ప్రజలకే అవసరమని చెప్పారు.టీఆర్ఎస్ కు వామపక్షాల మద్దతు వెనుక కమర్షియల్ కోణం ఉందన్నారు. బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందన్నారు. కరోనా వైరస్ కంటే కేసీఆర్ వైరస్ డేంజర్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

సీఎం పదవి కంటే తెలంగాణ సాధనే ముఖ్యమని జానారెడ్డి భావించారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సోనియాగాంధీ పిలిచి జానారెడ్డికి సీఎం పదవిని ఇస్తామని చెప్పినా కూడా ఆయన ఈ పదవిని తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఏవరైనా ప్రజాప్రతినిధి మరణిస్తే మరణించిన కుటుంబం నుంచి ఎవరైనా అభ్యర్థి బరిలోకి దింపితే ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించే సంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

Load More Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *