తెలంగాణలో కర్ప్యూ, లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి

మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, తెలంగాణకు మహారాష్ట్ర నుంచి వచ్చిపోయేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మహారాష్ట్ర ఎఫెక్ట్‌ తెలంగాణపై ఉంటుందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. కరోనా చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ పెట్టే పరిస్థితి లేదు. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు. కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం మెడికల్‌ కాలేజీల్లో సాధారణ పడకలతోపాటు ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్లు సిద్ధం చేసుకోవాలి ఈటల సూచించారు. హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు కోవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. వాటికి రూ.1.79 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డ ఆయుర్వేద కాలేజీ, నిజామియా టీబీ ఆస్పత్రి, సరోజినీదేవి ఆస్పత్రిలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. మెడికల్ కాలేజీల్లో కరోనా ట్రీట్‌మెంట్ కోసం సాదారణ బెడ్లతో పాటూ, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్ధం చేసుకోవాలని మంత్రి ఈటల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *