ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్‌లు, షూస్, హ్యండ్‌బ్యాగ్ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ధరించిన ఓ వాచ్ ఖరీదుపై నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది. చరణ్ ధరించిన వాచ్ పేరు, దాని ఖరీదు చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.
ఈ హీరో ధరించిన వాచ్ లక్ష 50 వేల డాలర్లు అట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని ధర ఏకంగా కోటి 50 లక్షలు. ఈ మధ్యకాలంలో చెర్రీ ఎక్కువగా ఈ వాచ్‌తోనే కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ వాచ్ ఖరీదు బయటపడటంతో అంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదైన వాచ్‌తో సామాన్యులు జీవితాంతం సంతోషంగా బతికేయచ్చు అని అంటుంటే.. మరికొందరు స్టార్స్ అన్నప్పుడు ఆమాత్రం ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవర్గం వారు ఆ వాచ్ డబ్బులు పేదవాళ్లకు ఇచ్చిన ఎంతోమంది బాగుపడతారు అంటూ హితవు పలుకున్నారు.