అనంతపురం జిల్లాలో పెద్ద శబ్ధంతో పేలిన ఎటీఎం యంత్రాలు..

అనంతపురం జిల్లా పామిడి ఎస్బీఐ ఏటీఎంలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఇక్కడి ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ మంటలు ఏటీఎం కేంద్రం మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రతకు ఏటీఎం మెషీన్లు పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు.

ఈ ఘటనలో ఏటీఎం మెషీన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఏటీఎంలో మంటలు ఎలా వచ్చాయన్నది తెలియరాలేదు.

Load More Related Articles
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *