9 ఏళ్ళ విరామం తర్వాత తొలి సమావేశం

విశాఖ జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 9 ఏళ్ళ విరామం తరువాత ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో 10 ప్రధాన.. 33 సప్లిమెంటరీ అంశాల తో అజెండా రూపకల్పన చేశారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర ణకు వ్యతి రేకంగా కౌన్సిల్ తీర్మానం చేయనుంది. వైసీపీ, టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, బీజేపీలకు చెందిన కార్పొ రేటర్లు వారి వారి పార్టీ కండు వాలు ధరించి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేసి కౌన్సిల్ కు టిడిపి కార్పొరేటర్లు హాజరైయ్యారు.విశాఖ జివిఎంసి లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చర్చ జరిగింది.విశాఖ జివిఎంసి కౌన్సిల్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. జివిఎంసి లో సిపిఎం కార్పొరేటర్ గంగారాం మాట్లాడుతూ దేశాభివృద్ధి సాధించింది అంటే ప్రభుత్వ పెట్టుబడి తో ఏర్పడిన సంస్థలు …అలాంటి సంస్థలను ప్రైవేట్ పరం చేయడం సరికాదని అన్నారు.

Load More Related Articles
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *