వదినతో వివాహేతర సంబంధం..తమ్ముడ్ని హత్య చేసిన అన్న

తల్లి లాంటి వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సోదరుడ్ని .. అన్న హతమార్చిన ఘటన మీరట్ లో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్, మీరట్ లోని కంకర్ ఖేరా పోలీసు స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్ లో 22 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరణించిన వ్యక్తి ని భీమ్ లోధిగా గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఫోన్ లోని కాల్ లిస్ట్ ద్వారా నిందితుడు అషు ను రెండు రోజుల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడు అషు నేరం ఒప్పుకున్నాడు. జవహర్ పురి ప్రాంతానికి చెందిన భీమ్ లోధి బీర్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటాడు. లోధి కి వరసకు సోదరుడయ్యే అషు, భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అషుకు తెలియకుండా వీరిద్దరూ గుట్టుగా తమ వ్యవహారం కొనసాగించ సాగారు. ఏప్రిల్ 5న భార్య ఫోన్ చూస్తుండగా అందులో తన సోదరుడు లోధితో , భార్య సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూశాడు.

దీంతో భార్యా భర్తలమధ్య వాగ్వాదం జరిగింది. ఇలా కాదనుకున్నాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న లోధిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సోదరులిద్దరికీ ఎప్పటి నుంచో డ్రగ్స్ తీసుకోవటం అలవాటుంది. వెంటనే లోధి కి ఫోన్ చేశాడు. డ్రగ్స్ తీసుకుందాం రమ్మని పిలిచాడు. ఇద్దరూ కల్సి సమీపంలోని పాడు బడిన రైల్వే క్వార్టర్స్ లోకి వెళ్లారు. అక్కడ పదునైన ఆయుధంతో లోధి గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఇటుకతో మొహాన్ని గుర్తుపట్టలేనంతగా కొట్టి ఇంటికి వెళ్లిపోయాడు. మొహం గుర్తుపట్టలేనంతాగ చితకొట్టాడు కనుక పోలీసులకు చిక్కే అవకాశం లేదనుకున్నాడు.

కానీ అషు, లోధిని హత్య చేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట సంభవించింది. లోధి అషు జుట్టు పట్టుకుని లాగాడు. హత్యకుగురైన లోధి చేతిలో అషు వెంట్రుకలు చిక్కుకుని ఉన్నాయి. ఘటనా స్ధలంలో దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు నిందితుడిని రెండు రోజుల్లోనే పట్టుకోగలిగారు

  • Big Breaking – జపాన్ లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ

    కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండటంతో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒ…
Load More Related Articles
Load More By admin
Load More In క్రైమ్

Leave a Reply

Your email address will not be published.