తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 8 జిల్లాల్లో హైఅలర్ట్…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వణికిస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధితో పాటు జిల్లాలపై వైద్యశాఖ అధికారులు దృష్టిసారించింది. దీంతో 8 జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చటంతో అధికార యంత్రంగం అలర్ట్ అయింది. దీంతో నియంత్రణకు అధికారులు కసరత్తును ముమ్మరం చేసింది. మేడ్చల్ – మల్కాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో ఆ 8 జిల్లాల్లో డీఎంహెచ్ వో, మెడికల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ఉన్నాతాధికారులు సూచించారు

8 జిల్లాల్లోనే వైరస్‌ అధికంగా ఎందుకు వ్యాపిస్తోంది? అనే అంశంపై వైద్యశాఖ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం.. ఆ జిల్లాల్లో  సుమారు 40 మందికి ఇప్పటికీ వైరస్పై అవగాహన లేదని, మరో 30ు మంది తమకు ఏం కాదులే అనే భావనతో ఉన్నారని, మరో 20ు మంది మాస్కు, భౌతిక దూరం వంటి కనీస నిబంధనలను పాటించడం లేదని అంచనా వేసింది. 10ు మంది తగిన జాగ్రత్తలు పాటించకుండా.. రాకపోకలు సాగించే క్రమంలో వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పరిస్థితి చేయి జారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజామాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌లలో మహరాష్ట్ర నుంచి వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది. మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో యూకే స్ట్రెయిన్‌ వ్యాప్తి చెందుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. .

Load More Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *