మంగ్లీ పాటకు మెగాస్టార్‌ ఫిదా..!

ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ‘యోగితత్వం’ పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ గీతాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సాంగ్‌ మంగ్లీ వాయిస్‌లో చాలా బాగుందని, చాలా బాగా పాడిందని తెలుపుతూ.. సాంగ్ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. మెగాస్టార్‌ చేతుల మీదుగా తన పాట విడుదలవ్వడంతో ఎంతో ఆనందంగా ఉందని సింగర్‌ మంగ్లీ తెలిపింది. దాము రెడ్డి ఈ పాటకు దర్శకత్వం వహించారు.

బాజి సంగీతాన్ని సమకూర్చగా.. ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్… ‘నా గురుడు నన్నింకా యోగి గమ్మననె, యోగి గమ్మననె, రాజయోగి గమ్మననె..’ అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది.

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published.