సన్‌రైజర్స్‌కు డబుల్‌ ధమాకా..

ఐపీఎల్‌ 2021 కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్‌, కేన్ విలియ‌మ్సన్‌లు చెన్నైలో ల్యాండయ్యారు. వీరితోపాటు ఆ జట్టు సహాయ కోచ్ బ్రాడ్ హ‌డిన్ కూడా చెన్నైకు వ‌చ్చాడు. ఈ విష‌యాన్ని స‌న్‌రైజ‌ర్స్ యాజమాన్యం త‌మ ట్విట‌ర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. “ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి.. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, బ్రాడ్‌ హడిన్‌లకు స్వాగతం” అంటూ స‌న్‌రైజ‌ర్స్ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా, ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న 14వ ఐపీఎల్‌ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ జట్టు త‌మ తొలి ఐదు మ్యాచ్‌ల‌ను చెన్నైలోనే ఆడ‌నుంది. ఈ నెల 11న తమ తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల అనంతరం హైదరాబాద్‌ జట్టు..  ఢిల్లీలో నాలుగు మ్యాచ్‌లు, ఆతరువాత కోల్‌క‌తాలో మూడు, బెంగ‌ళూరులో రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది.

Load More Related Articles
Load More By admin
  • Casino Munkebjerg I Vejle

    Casino Munkebjerg I Vejle Så et tilbud kan for eksempel lyde på 100% match på dit første i…
  • Casino Munkebjerg I Vejle

    Casino Munkebjerg I Vejle Så et tilbud kan for eksempel lyde på 100% match på dit første i…
  • Lovligt Og Ulovligt Spil

    Lovligt Og Ulovligt Spil Der er lavet masser af film, skrevet bøger og mange steder på int…
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *