సాగర్ లో టీఆర్ఎస్ దే విజయం – తలసాని

నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అఖండ విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. భగత్ కు అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. ఉన్నత విద్యావంతుడైన భగత్ ను గెలిపించడం వల్ల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ఆదాయం పెంచేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తలసాని వెల్లడించారు. రైతుల సంక్షేమ కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లుకు ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.

భగత్ తన తండ్రి నోముల నర్సింహయ్యకు చేదోడువాదోడుగా ఉండేవారని, ఈ క్రమంలోనే భగత్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని తలసాని సాగర్ నియోజకవర్గ ప్రజలను కోరారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు గెలిచినప్పటికీ, ఈ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపిలకు ఓటేస్తే ఎటువంటి లాభం ఉండదని, ఈ క్రమంలోనే భగత్ కు మద్ధతు తెలిపి, భారీ మెజార్టీతో గెలిపించాలని తలసాని నియోజకవర్గ ప్రజలను కోరారు.

Load More Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *