టీడీపీ కోసం తెర మీదకు ఎన్టీఆర్…గోరంట్ల బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు

టీడీపీలో వ్యవస్థాపక మార్పులు వస్తాయి అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సహా చాలామంది రాబోతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీలోకి చాలామంది వస్తారు, చాలామంది రాబోతున్నారు అని పేర్కొన్న ఆయన వారివలన టీడీపీలో వ్యవస్థాగత మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ కుంగుబాటుకు గురవుతోందని అందుకే అన్ని ప్రాంతాల నుంచి అన్ని సామాజిక వర్గాలకు చెందిన చాలామంది తెలుగు దేశం కోసం బయటకు వస్తారని ఆయన పేర్కొన్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అని ప్రచారం ఇప్పటిది కాదు, ఏదో ఒక అంశంలో ఈ విషయం నానూతూనే ఉంటుంది. మొన్నీమధ్య తెల్లవారితే గురువారం అనే ఒక సినిమా ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ వారిని వారించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సహా బాలకృష్ణ, లోకేష్ అందరూ వస్తారు అంటూ బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవి ఏనా లేక పార్టీ గురించి ఏమైనా చర్చ జరుగుతుందా అని ఆసక్తి మొదలైంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *