సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 1న గుంటూరులో పర్యటించనున్నారు. భారత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం 140వ వార్డు సచివాలయంలో జగన్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి, మేయర్ మనోహర్, ఎమ్మెల్యే మద్దాలగిరి, జిల్లా అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ ” కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ వ్యాక్సినేషన్లో ముందున్నాం. సెకండ్ వేవ్ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏప్రిల్ 1నుంచి సచివాలయాల్లో అందుబాటులో తెస్తున్నాం. ఏప్రిల్ 1న 140వ వార్డు సచివాలయంలో సీయం జగన్ వ్యాక్సిన్ తీసుకుంటారు. ప్రజల్లో అపోహలు తొలగాలి. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలంతా పాటించాలి” అని అన్నారు.