మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరో వైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పటివరకు ఎంతోమంది అగ్రహీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమన్నా.. గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ అమ్మడు అబ్బాయిగా మారేందుకు ట్రై చేసింది. కానీ అది సక్సెస్ కాదు కాద… అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, తమన్నా మీసాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అవి కింద పడిపోతున్నాయి.. ఎంతో కష్టపడి చివరకు తమన్నా మీసాలను పెట్టుకున్నారు. మీసాలలో తమన్నాను చూసిన నెటిజన్లు తమన్నా ఎలా ఉన్నా అందంగానే ఉంటారని కామెంట్స్ చేయడం గమనార్హం. తమన్నా ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోకు లక్షల సంఖ్యలో లైకులు వస్తున్నాయి. మరోవైపు తమన్నా ఎఫ్ 3 సినిమాతో పాటు అంధాధూన్ రీమేక్ లో నటిస్తున్నారు.