నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం.. ఫోనులో ప్రధాని ఆరా

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి తెలిపింది. తదుపరి చికిత్సల కోసం ఎయిమ్స్‌లో రాష్ట్రపతి చేరనున్నట్టు పేర్కొంది. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో రాష్ట్రపతి శుక్రవారంనాడు ఆర్మీ ఆసుపత్రిలో చేరారు.

ఆరోగ్య పరీక్షలతో వైద్యులు పర్యవేక్షణలో రాష్ట్రపతికి చికిత్స అందుతోంది. తన ఆరోగ్యం గురించి తెలిసి త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అని రాష్ట్రపతి కార్యాలయం ఓ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచే రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి కుమారుడితో ప్రధాని ఫోనులో మాట్లాడారని, కోవింద్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిలషించారని పీఎంఓ ఓ ట్వీట్‌లో పేర్కొంది.

Load More Related Articles
Load More In నేషనల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *