కరోనా నియంత్రణపై మంత్రి ఆళ్ళ నాని సమీక్ష…కీలక ఆదేశాలు

కరోనా నియంత్రణపై మంత్రి ఆళ్ళ నాని ఈరోజు సమీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలకు చెందిన డిహెచ్ఎంఓ లతో అయన మాట్లాడారు. కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో తిరిగి కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలకు సర్వే బృందాలను పంపాలని అధికారులకు సూచించారు. చిత్తూరు జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాలకు సమీపంలో చిత్తూరు జిల్లా ఉండటంతో కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆళ్లనాని పేర్కొన్నారు. తిరుపతిలో రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అయన పేర్కొన్నారు. చిత్తూరు, మదనపల్లిలో 180 బెడ్స్ ను సిద్ధం చేసినట్టు మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు.

Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *