టార్గెట్ జపాన్..రెండు బాలిస్టిక్ మిసైల్స్ వదిలిన ఉత్తరకొరియా

ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ తన నియంత వైఖరిని మరోసారి చూపించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జపాన్ తూర్పు ప్రాంత సముద్ర తీరంపైకి ఉత్తరకొరియా రెండు బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగిచింది. తమ దేశ సముద్రత తీరంపైకి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్ ప్రధాన మంత్రి యోషిహిడె సుగ ధృవీకరించారు. బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారిగా యోషిహిడె సుగా వెల్లడించారు. ఉత్తర అమెరికా భద్రతాధికారులు, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నిర్థారించారు.

ఉత్తరకొరియా ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి మీడియం రేంజ్, మరొకటి షార్ట్ రేంజ్ మిస్సైల్ గా భావిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించినట్లు ఆ దేశం మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా ప్రయోగించిన రెండింట్లో ఒకటి.. అత్యాధునికమైన క్షిపణిగా అంచనా వేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయి?, ఏ లక్ష్యాన్ని అవి ఛేదించాయి? వాటి ప్రయాణ కాలం ఎంత? అనే విషయంపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని అక్కడి అధికారి తెలిపారు. ఈ ఉదంతంపై తాము దక్షిణ కొరియాతో కలిసి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *