ఆ హీరోకు విలన్ గా మెగా బ్రదర్.. న్యూ లుక్ తో వైరల్ అవుతున్న నాగబాబు ఫోటోలు…

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పాక్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో దేశవ్యాప్తంగా వారికంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుున్నారు.

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలుగులో సూపర్ హిట్ కొట్టి ప్రభాష్ కెరీర్ లో గుర్తిండిపోయిన సినిమా చత్రపతి.. ఈ సినిమాకు తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ప్రభాష్, రాజమౌళి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీని హిందీ రీమేక్ లో చేయనున్నారు.

ఈ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో వివి వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు విలన్ గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో నటించడానికి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో నాగబాబు నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. అయితే తాజగా, నాగబాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటి వరకు తెల్ల గడ్డంతో కనిపించిన నాగబాబు.. గడ్డాన్ని ట్రిమ్ చేసి చేతిలో సిగరేట్ తో ముఖంపై ఘాటుతో మాస్ లుక్ లో కేక పుట్టిస్తున్నాడు.. మరీ ఈ లుకో దేనికోసం తెలియలాంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *