ఏపీలో పంజా విసురుతున్న కరోనా వైరస్… కొత్తగా 758 మందికి పాజిటివ్.. భయాందోళనల్లో ప్రజలు…

ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. ఇటీవలే తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా 758 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మరో 127 మంది కరోనా బారినపడ్డారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. అదే సమయంలో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,201కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,95,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,209 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తుంది.. కొన్నిచోట్ల ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటూ.. లాక్ డౌన్ లు విధిస్తూ ఆయా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో కూడా స్కూల్ ను మూసివేసి సంగతితెలిసిందే.. కాగా, కరోనా వ్యాక్సిన్ పై కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాకుండా కరోనా వైరస్ పై జిల్లాల వారీగా అవగాహన సదస్సులు, వ్యాక్సిన్ వేయించడం తదితర జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి మాత్రం వదలను బొమ్మాలి.. వదల అంటుంది..

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.